Home కీర్తనలు 16 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 16

తెలుగు బైబిల్
1దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. 2నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును 3నేనీలాగందును భూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు. 4యెహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపను వారి పేళ్లు నా పెదవులనెత్తను. 5యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు. 6మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను. 7నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకుబోధించుచున్నది. 8సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. 9అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది 10ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు 11జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme