Home
Bible Study with Steffi
కీర్తనలు 61 · తెలుగు బైబిల్
A-
A+
||
Aa
కీర్తనలు
Chapter 61
తెలుగు బైబిల్
1
దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము
2
నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకి నన్ను ఎక్కించుము.
3
నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి
4
యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా. )
5
దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించి యున్నావు నీ నామమునందు భయభక్తులుగలవారి స్వాస్థ్యము నీవు నాకనుగ్రహించి యున్నావు.
6
రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక అతని సంవత్సరములు తరతరములు గడచును గాక.
7
దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము.
8
దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించు నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను.
Bible Study with Steffi App
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.
Download Free ↗
← Previous
Next →
Choose Theme