Home కీర్తనలు 16:5 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 16 · Verse 5

తెలుగు బైబిల్

కీర్తనలు 16:5

యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు.

Book: Psalm · Chapter: 16 · Verse: 5

Cross References

ద్వితీయోపదేశకాండము 18:2

వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు; యెహోవా వారితో చెప్పి నట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనులవలన, అనగా ఎద్దుగాని గొఱ్ఱెగాని మేకగాని బలిగా అర్పించువారి వలన

ద్వితీయోపదేశకాండము 32:9

యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే.

యెహోషువ 22:25

రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను గదా యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుటవలన మీ సంతా నపువారు మా సంతానపువా రిని యెహోవా విషయములో భయభక్తులులేని వార గునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితివిు.

యెహోషువ 22:27

మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధానబలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవచేయవలయు ననుటకుయెహోవాయందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండు నట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరములవారికిని మధ్య సాక్షియైయుండును.

కీర్తనలు 2:6

నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను

కీర్తనలు 9:4

కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురునీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు.

కీర్తనలు 11:6

దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారికి పానీయభాగమగును.

కీర్తనలు 21:7

ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక యుంచు చున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును.

కీర్తనలు 23:5

నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.

కీర్తనలు 61:6

రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక అతని సంవత్సరములు తరతరములు గడచును గాక.

కీర్తనలు 73:26

నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.

కీర్తనలు 89:4

తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి యున్నాను. (సెలా. )

కీర్తనలు 89:20

నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను.

కీర్తనలు 110:1

ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.

కీర్తనలు 116:13

రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.

కీర్తనలు 119:57

(హేత్‌)యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme