Numbers 2 · తెలుగు బైబిల్

Numbers

Chapter 2

తెలుగు బైబిల్
1మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.
2ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను.
3సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.
4అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.
5అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారు డైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.
6అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.
7అతని సమీపమున జెబూలూనుగోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.
8అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగు వందలమంది.
9యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారు వేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.
10రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.
11అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.
12అతని సమీపమున షిమ్యోను గోత్రి కులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీ యేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.
13అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందలమంది.
14అతని సమీపమున గాదు గోత్ర ముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయా సాపు గాదు కుమారులకు ప్రధానుడు.
15అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదు వేల ఆరువందల ఏబదిమంది.
16రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.
17ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.
18ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారు డైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.
19అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.
20అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీ యేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.
21అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండు వేల రెండువందలమంది.
22అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.
23అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది.
24ఎఫ్రాయిము పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.
25దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు.
26అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండు వేల ఏడువందలమంది.
27అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.
28అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.
29అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.
30అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది.
31దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
32వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబ ముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.
33అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రా యేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.
34అట్లు ఇశ్రా యేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్త మును చేసిరి. అట్లు వారు తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచు నుండిరి.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme