Home యెహెజ్కేలు 15 · తెలుగు బైబిల్

యెహెజ్కేలు

Chapter 15

తెలుగు బైబిల్
1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కఱ్ఱ అడవిచెట్లలోనున్న ద్రాక్షచెట్టు కఱ్ఱ తక్కినచెట్ల కఱ్ఱకంటెను ఏమైన శ్రేష్ఠమా? 3యే పనికైనను దాని కఱ్ఱను తీసికొందురా? యేయొక ఉపకరణము తగిలించుటకై యెవరైన దాని కఱ్ఱతో మేకునైనను చేయుదురా? 4అది పొయ్యికే సరిపడును గదా? అగ్నిచేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా? 5కాలక ముందు అది యే పనికిని తగక పోయెనే; అగ్ని దానియందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? 6కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను అగ్ని కప్పగించిన ద్రాక్షచెట్టు అడవి చెట్లలో ఏలాటిదో యెరూషలేము కాపురస్థులును ఆలాటివారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నాను. 7నేను వారిమీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును; వారి యెడల నేను కఠిన దృష్టిగలవాడనై యుండగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు. 8వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడుచేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme