1 రాజులు 13:21అంతట అతడు యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుని పిలిచియెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడునీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞా పించినదానిని గైకొనక
1 రాజులు 14:13అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.
2 రాజులు 9:27యూదారాజైన అహజ్యా జరిగిన దాని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను; అయినను యెహూ అతని తరిమి, రథమునందు అతని హతముచేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను.
2 రాజులు 9:34అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాతఆ శాపగ్రస్తు రాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొనిపాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా
2 దినవృత్తాంతములు 17:3యెహోవా అతనికి సహాయుడై యుండగా యెహోషాపాతు తన తండ్రియైన దావీదు ప్రారంభదినములలో నడచిన మార్గమందు నడచుచు
2 దినవృత్తాంతములు 17:4బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్ర యించుచు, ఇశ్రాయేలువారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలననుసరించి నడిచెను.
2 దినవృత్తాంతములు 19:3అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణచేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.
2 దినవృత్తాంతములు 21:4యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని, తన సహోదరులనందరిని ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని హతముచేసెను.
2 దినవృత్తాంతములు 21:17వారు యూదా దేశముమీదికి వచ్చి దానిలో చొరబడి రాజ నగరునందు దొరకిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొనిపోయిరి; అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు.
2 దినవృత్తాంతములు 21:20అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు; యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను; రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతని పాతిపెట్టిరి.
2 దినవృత్తాంతములు 22:8యెహూ అహాబు సంతతి వారిమీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను, అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతముచేసెను.
2 దినవృత్తాంతములు 24:25వారు యోవాషును విడచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియై యుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్యదోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరు వాత జనులు దావీదు పట్టణమందు అతని పాతి పెట్టిరి గాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు.
2 దినవృత్తాంతములు 25:27అమజ్యా యెహోవాను అనుస రించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతనిమీద కుట్రచేయగా అతడు లాకీషునకు పారి పోయెను.