Home 2 దినవృత్తాంతములు 19:3 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 19 · Verse 3

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 19:3

అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణచేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.

Book: 2 Chronicles · Chapter: 19 · Verse: 3

Cross References

1 రాజులు 14:13

అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.

2 దినవృత్తాంతములు 11:16

వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములయం దంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనినవారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలుల నర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి.

2 దినవృత్తాంతములు 12:12

అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలముచేయక, యూదావారు కొంత మట్టుకు మంచితనము ననుసరించుట చూచి తన కోపము అతనిమీదనుండి త్రిప్పుకొనెను.

2 దినవృత్తాంతములు 12:14

అతడు తన మనస్సు యెహోవాను వెదకుట యందు నిలుపుకొనక చెడుక్రియలు చేసెను.

2 దినవృత్తాంతములు 15:12

పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణచేయుదు మనియు

2 దినవృత్తాంతములు 15:15

ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతో షించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెను.

2 దినవృత్తాంతములు 17:3

యెహోవా అతనికి సహాయుడై యుండగా యెహోషాపాతు తన తండ్రియైన దావీదు ప్రారంభదినములలో నడచిన మార్గమందు నడచుచు

2 దినవృత్తాంతములు 17:6

యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనినవాడై ఉన్నత స్థలములను దేవతాస్తంభములను యూదాలోనుండి తీసివేసెను.

2 దినవృత్తాంతములు 22:9

అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతని పట్టుకొని యెహూనొద్దకు తీసికొనివచ్చిరి; వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి; కాగా రాజ్యమేలుటకు అహజ్యా యింటి వారు ఇక నెవరును లేకపోయిరి.

2 దినవృత్తాంతములు 27:6

ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచ బడెను.

2 దినవృత్తాంతములు 30:19

పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా

ఎజ్రా 7:10

ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసికొనెను.

కీర్తనలు 57:7

నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను.

రోమీయులకు 7:18

నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme