Home 2 దినవృత్తాంతములు 21:20 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 21 · Verse 20

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 21:20

అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు; యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను; రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతని పాతిపెట్టిరి.

Book: 2 Chronicles · Chapter: 21 · Verse: 20

Cross References

2 దినవృత్తాంతములు 23:21

దేశజనులందరు సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను.

2 దినవృత్తాంతములు 24:25

వారు యోవాషును విడచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియై యుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్యదోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరు వాత జనులు దావీదు పట్టణమందు అతని పాతి పెట్టిరి గాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు.

2 దినవృత్తాంతములు 28:26

అతడుచేసిన యితర కార్యములను గూర్చియు, అతని చర్య యంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.

2 దినవృత్తాంతములు 28:27

ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతి పెట్టబడెనుగాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను.

2 దినవృత్తాంతములు 33:20

మనష్షే తన పితరులతోకూడ నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.

సామెతలు 10:7

నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును

యిర్మియా 22:18

కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగ లార్చరు.

యిర్మియా 22:28

కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme