Home కీర్తనలు 7:5 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 7 · Verse 5

తెలుగు బైబిల్

కీర్తనలు 7:5

శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్మునా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్మునా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా(సెలా. )

Book: Psalm · Chapter: 7 · Verse: 5

Cross References

1 సమూయేలు 24:11

నా తండ్రీ చూడుము, ఇదిగో, చూడుము. నిన్ను చంపక నీ వస్త్రపుచెంగు మాత్రమే కోసితిని గనుక నావలన నీకు కీడు ఎంతమాత్రుును రాదనియు, నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు, నీవు తెలిసికొనవచ్చును. నీ విషయమై నేను ఏపాపమును చేయనివాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు.

1 సమూయేలు 24:18

ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారముచేసిన వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడిచేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు.

1 సమూయేలు 24:20

నిశ్చయముగా నీవు రాజ వగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచ బడుననియు నాకు తెలియును.

యోబు 16:15

నా చర్మముమీద నేను గోనెపట్ట కూర్చుకొంటినినా కొమ్మును ధూళితో మురికిచేసితిని.

యోబు 31:5

అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల

యోబు 31:38

నా భూమి నామీద మొఱ్ఱపెట్టిన యెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల

యోబు 40:12

గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగ ద్రొక్కుము.

కీర్తనలు 3:2

దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదనినన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా. )

కీర్తనలు 44:5

నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము.

కీర్తనలు 49:12

ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించుమృగములను పోలినవాడు.

కీర్తనలు 60:12

దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.

యెషయా 10:6

భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.

యెషయా 63:3

ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే.

యిర్మియా 17:13

ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.

హబక్కూకు 3:13

నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలు దేరుచున్నావు దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండ వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. (సెలా. )

జెకర్యా 10:5

వారు యుద్ధముచేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురవలె ఉందురు. యెహోవా వారికి తోడైయుండును గనుక వారు యుద్ధముచేయగా గుఱ్ఱములను ఎక్కువారు సిగ్గునొందుదురు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme