కీర్తనలు 7:4
నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల
కీర్తనలు 7:4
నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల
వారు ఆ పట్టణమునుండి బయలు దేరి యెంతో దూరము వెళ్లక మునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని మీరు మేలుకు కీడు చేయనేల?
నీ దాసులలో ఎవరియొద్ద అది దొరుకునో వాడు చచ్చును గాక; మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి.
యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదును గూర్చి దయగా మాటలాడినీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలుచేసెను గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక.
పిమ్మట దావీదు రామాలోని నాయోతునుండి పారి పోయి యోనాతాను నొద్దకు వచ్చినేను ఏమి చేసితిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని యడుగగా
అహీమెలెకురాజా, రాజునకు అల్లుడై నమ్మకస్థుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదువంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు?
ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను.
ఆలోచించుము; ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నాచేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివే; కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించిఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక నా యేలినవాని చంపనని నేను చెప్పితిని.
దావీదుతో ఇట్లనెను - యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు
నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలిన వాడ వగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును. నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగ కుండును.
దావీదునీవతని చంపకూడదు, యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము?
అందుకు సౌలునేను పాపము చేసితిని, ఈ దినమున నాప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండినదానిబట్టి నేను నీకిక కీడుచేయను. దావీదా నాయనా, నాయొద్దకు తిరిగిరమ్ము; వెఱ్ఱి వాడనై నేను బహు తప్పు చేసితిననగా
చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలోనుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను.
ఛీపో, ఛీపో, నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి యున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపింపగా
న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచినయెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినయెడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల
నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.
తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.