Home సామెతలు 19:12 · తెలుగు బైబిల్

సామెతలు

Chapter 19 · Verse 12

తెలుగు బైబిల్

సామెతలు 19:12

రాజు కోపము సింహగర్జనవంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచు వంటిది.

Book: Proverbs · Chapter: 19 · Verse: 12

Cross References

2 సమూయేలు 23:4

ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బు లేకుండ ఉదయించిన సూర్యునివలెను వర్షము కురిసినపిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలోనుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును.

ఎస్తేరు 1:12

రాణియైన వష్తి నపుంసకులచేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులుకొనెను.

ఎస్తేరు 7:8

నగరువనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్యమీద హామాను బడియుండుట చూచివీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుకు వేసిరి.

కీర్తనలు 72:6

గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజ యము చేయును.

కీర్తనలు 133:3

సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.

సామెతలు 16:14

రాజు క్రోధము మరణదూత జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును.

సామెతలు 20:2

రాజువలని భయము సింహగర్జనవంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందురు

సామెతలు 28:15

బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు.

ప్రసంగి 8:4

రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగల వాడెవడు?

దానియేలు 2:12

అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గల వాడై బబులోనులోని జ్ఞానులనందరిని సంహరింపవలెనని యాజ్ఞ ఇచ్చెను.

దానియేలు 3:19

అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను.

దానియేలు 5:19

దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను; ఎవరిని పడ వేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములును జనులును ఆ యా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి.

దానియేలు 6:24

రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలుమీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొనివచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెను.

హోషేయ 14:5

చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు.

మీకా 5:7

యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచువలెను, మనుష్య ప్రయత్నములేకుండను నరులయోచన లేకుండను గడ్డిమీద పడు వర్షమువలెను ఆయాజనములమధ్యను నుందురు.

లూకా 12:4

నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme