Home నెహెమ్యా 11:30 · తెలుగు బైబిల్

నెహెమ్యా

Chapter 11 · Verse 30

తెలుగు బైబిల్

నెహెమ్యా 11:30

జానోహలోను అదు ల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.

Book: Nehemiah · Chapter: 11 · Verse: 30

Cross References

యెహోషువ 10:3

హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును,

యెహోషువ 12:15

అదుల్లాము రాజు, మక్కేదా రాజు,

యెహోషువ 15:8

ఆ సరిహద్దు పడమట బెన్‌హిన్నోములోయ మార్గముగా దక్షిణదిక్కున యెబూసీయుల దేశమువరకు, అనగా యెరూషలేమువరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పువరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది.

యెహోషువ 15:34

జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము

యెహోషువ 15:39

లాకీషు బొస్కతు ఎగ్లోను

యెహోషువ 18:16

ఉత్తరదిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్‌ హిన్నోము లోయయెదుటనున్న కొండప్రక్కననుండి దక్షిణదిక్కున బెన్‌హిన్నోము లోయమార్గమున యెబూ సీయుల ప్రదేశమువరకు సాగి ఏన్‌రోగేలువరకు వ్యాపించెను.

2 రాజులు 23:10

మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్‌ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశ మును అతడు అపవిత్రము చేసెను.

నెహెమ్యా 3:13

లోయద్వారమును హానూనును జానోహ కాపురస్థులును బాగుచేసి కట్టినతరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారమువరకుండు గోడ వెయ్యిమూరల దనుక వారుకట్టిరి.

యెషయా 37:8

అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.

యిర్మియా 7:31

నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.

యిర్మియా 19:2

నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచు కొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్‌హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.

యిర్మియా 19:6

ఇందునుబట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అనియైనను బెన్‌ హిన్నోము లోయ అనియైనను పేరు వాడబడదు.

యిర్మియా 32:35

వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్టింపవలెనని బెన్‌ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠము లను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేను వారి కాజ్ఞాపింప లేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు.

మీకా 1:15

మారేషా నివాసీ, నీకు హక్కు దారుడగు ఒకని నీయొద్దకు తోడుకొని వత్తురు, ఇశ్రాయేలీయులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme