యెహోషువ 18:16
ఉత్తరదిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్ హిన్నోము లోయయెదుటనున్న కొండప్రక్కననుండి దక్షిణదిక్కున బెన్‌హిన్నోము లోయమార్గమున యెబూ సీయుల ప్రదేశమువరకు సాగి ఏన్‌రోగేలువరకు వ్యాపించెను.
యెహోషువ 18:16
ఉత్తరదిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్ హిన్నోము లోయయెదుటనున్న కొండప్రక్కననుండి దక్షిణదిక్కున బెన్‌హిన్నోము లోయమార్గమున యెబూ సీయుల ప్రదేశమువరకు సాగి ఏన్‌రోగేలువరకు వ్యాపించెను.
ఆ సరిహద్దు ఆకోరులోయనుండి దెబీరువరకును ఏటికి దక్షిణతీరముననున్న అదుమీ్మము నెక్కుచోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తరదిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్‌షే మెషు నీళ్లవరకు వ్యాపించెను. దాని కొన ఏన్‌రోగేలునొద్ద నుండెను.
యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.
వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము.
యూదావంశస్థులు యెరూషలేముమీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చి వేసిరి.
యెరూషలేములో నివసించు యెబూసీ యులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు; యెబూసీ యులు బెన్యామీనీయులతో కూడ నేటివరకు యెరూష లేములో నివసించుచున్నారు.
అతడు అక్కడ ఆ రాత్రి గడప నొల్లక లేచి వెళ్లి, యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్ట బడిన రెండు గాడిదలును
తాము పట్టణముతట్టు వచ్చిన సంగతి తెలియబడక యుండునట్లు యోనాతానును అహిమయస్సును ఏన్‌రోగేలు దగ్గర నిలిచియుండగా పని కత్తెయొకతెవచ్చి, హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి.
అదోనీయా ఏన్‌రోగేలు సమీప మందుండు జోహెలేతు అను బండదగ్గర గొఱ్ఱెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి, రాజకుమారు లగు తన సహోదరులనందరిని యూదావారగు రాజు యొక్క సేవకులనందరిని పిలిపించెను గాని
మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశ మును అతడు అపవిత్రము చేసెను.
ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలోదిగిరి.
మరియు అతడు బెన్ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలచొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను.
బెన్‌హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచ ములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయ నకు కోపము పుట్టించెను.
పూర్వమునుండి తోపెతు సిద్ధపరచబడియున్నది అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి యున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.
నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.
నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచు కొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్‌హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.
ఇందునుబట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అనియైనను బెన్ హిన్నోము లోయ అనియైనను పేరు వాడబడదు.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.