Home మత్తయి 9:4 · తెలుగు బైబిల్

మత్తయి

Chapter 9 · Verse 4

తెలుగు బైబిల్

మత్తయి 9:4

యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?

Book: Matthew · Chapter: 9 · Verse: 4

Cross References

కీర్తనలు 44:21

హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?

కీర్తనలు 139:2

నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

యెహెజ్కేలు 38:10

ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభి ప్రాయములు పుట్టును,

మత్తయి 12:25

ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు.

మత్తయి 16:7

కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి.

మార్కు 2:8

వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు?

మార్కు 8:16

వారుతమయొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనిరి.

మార్కు 12:15

ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగిమీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను.

లూకా 5:22

యేసు వారి ఆలోచన లెరిగిమీరు మీ హృదయములలో ఏమి ఆలో చించుచున్నారు?

లూకా 6:8

అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవాని తోనీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను.

లూకా 7:40

అందుకు యేసుసీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడుబోధకుడా, చెప్పుమనెను.

లూకా 9:46

తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా

లూకా 11:17

ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును.

యోహాను 2:24

అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు

యోహాను 6:61

యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?

యోహాను 6:64

మీలో విశ్వ సించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వ సించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme