Home మత్తయి 10:19 · తెలుగు బైబిల్

మత్తయి

Chapter 10 · Verse 19

తెలుగు బైబిల్

మత్తయి 10:19

వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును.

Book: Matthew · Chapter: 10 · Verse: 19

Cross References

నిర్గమకాండము 4:12

కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.

నిర్గమకాండము 4:15

నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి, మీరు చేయవలసినదానిని మీకు బోధించెదను.

యిర్మియా 1:7

యెహోవా నాకీలాగు సెలవిచ్చెను - నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్ప వలెను.

యిర్మియా 1:9

అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.

దానియేలు 3:16

షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ, యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు.

మత్తయి 6:25

అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి;

మత్తయి 6:31

కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.

మత్తయి 6:34

రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.

మార్కు 13:11

వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవు నప్పుడు మీరుఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి; చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు.

లూకా 12:11

వారు సమాజమందిరముల పెద్దలయొద్దకును అధిపతులయొద్దకును అధికారులయొద్దకును మిమ్మును తీసికొని పోవునప్పుడు మీరుఏలాగు ఏమి ఉత్తర మిచ్చెదమా, యేమి మాటలాడు దుమా అని చింతింప కుడి,

లూకా 21:12

ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధి పతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.

అపొస్తలుల కార్యములు 4:8

పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను ప్రజల అధికారులారా, పెద్దలారా,

అపొస్తలుల కార్యములు 5:29

అందుకు పేతురును అపొస్తలులునుమనుష్యలకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.

అపొస్తలుల కార్యములు 6:10

మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి.

అపొస్తలుల కార్యములు 26:2

అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక

ఫిలిప్పీయులకు 4:6

దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme