Home మత్తయి 6:31 · తెలుగు బైబిల్

మత్తయి

Chapter 6 · Verse 31

తెలుగు బైబిల్

మత్తయి 6:31

కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.

Book: Matthew · Chapter: 6 · Verse: 31

Cross References

లేవీయకాండము 25:20

ఏడవ యేట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకొందురేమో.

2 దినవృత్తాంతములు 25:9

అమజ్యా దైవజనుని చూచిఇశ్రాయేలువారి సైన్యమునకు నేనిచ్చిన రెండువందల మణుగుల వెండికి ఏమి చేసెదమని అడిగి నందుకుదీనికంటె మరి యధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను.

కీర్తనలు 37:3

యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము

కీర్తనలు 55:22

నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.

కీర్తనలు 78:18

వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి.

మత్తయి 4:4

అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.

మత్తయి 15:33

ఆయన శిష్యులుఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి.

లూకా 12:29

ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.

1 పేతురు 5:7

ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme