లేవీయకాండము 22:2
ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించువాటి వలన అహరోనును అతని కుమారులును నా పరిశుద్ధనామ మును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైనవాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము; నేను యెహోవాను.
లేవీయకాండము 22:2
ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించువాటి వలన అహరోనును అతని కుమారులును నా పరిశుద్ధనామ మును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైనవాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము; నేను యెహోవాను.
ప్రతి తొలి చూలుపిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగసంతానము యెహోవా దగును.
తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధ మైనవాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను; వారు యెహోవా సన్నిధిని అంగీక రింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను.
ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాస స్థల మును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను.
నీవు ఏ మాత్రమును నీ సంతానమునుమోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయ కూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.
నా నామమునుబట్టి అబద్ధప్రమా ణము చేయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచ కూడదు; నేను యెహోవాను.
ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.
వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావున వారు పరిశుద్ధులై యుండవలెను.
నీవు వారితో ఇట్లనుముమీ తర తరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించినయెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను.
నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రా యేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును;
ద్రాక్షా రసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండి నవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.
మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాప శిక్షను భరింపకుందురు; మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీ యుల ప్రతిష్ఠితమైనవాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.
నీ గోవులలో నేమి నీ గొఱ్ఱె మేకలలోనేమి తొలి చూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొఱ్ఱె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు.
పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.