Home లేవీయకాండము 19:12 · తెలుగు బైబిల్

లేవీయకాండము

Chapter 19 · Verse 12

తెలుగు బైబిల్

లేవీయకాండము 19:12

నా నామమునుబట్టి అబద్ధప్రమా ణము చేయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచ కూడదు; నేను యెహోవాను.

Book: Leviticus · Chapter: 19 · Verse: 12

Cross References

నిర్గమకాండము 20:7

నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు.

లేవీయకాండము 6:3

పోయినది తనకు దొరికినప్పుడు దానిగూర్చి బొంకినయెడల నేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగు దురో వాటన్నిటిలో దేనివిషయమైనను అబద్ధప్రమాణము చేసినయెడల నేమి,

లేవీయకాండము 18:21

నీవు ఏ మాత్రమును నీ సంతానమునుమోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయ కూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.

లేవీయకాండము 20:3

ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.

లేవీయకాండము 24:11

ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసి కొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమారె

లేవీయకాండము 24:15

మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముతన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.

ద్వితీయోపదేశకాండము 5:11

నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థ ముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు.

కీర్తనలు 15:4

అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.

యెషయా 48:1

యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి.

యిర్మియా 4:2

సత్యమునుబట్టియు న్యాయమును బట్టియు నీతినిబట్టియు యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన యెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయనయందే అతిశయపడుదురు.

యిర్మియా 5:2

యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు.

యిర్మియా 7:9

ఇదేమి? మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు

యిర్మియా 34:16

పిమ్మట మీరు మనస్సు మార్చుకొని నా నామమును అపవిత్రపరచితిరి వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రు లుగా పోనిచ్చిన తరువాత, అందరును తమ దాసదాసీలను మరల పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరచుకొంటిరి

యెహెజ్కేలు 36:20

వారు తాము వెళ్లిన స్థలముల లోని జనులయొద్ద చేరగా ఆ జనులువీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా, అని చెప్పుటవలన నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి.

జెకర్యా 5:3

అందుకతడు నాతో ఇట్లనెనుఇది భూమియంతటిమీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.

జెకర్యా 5:4

ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme