యోబు 36:20
జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము.
యోబు 36:20
జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము.
అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను.
ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి.
దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?
దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాకచేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక.
కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.
నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలునీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలునాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను.
ఆశ యేదైన నాకుండిన యెడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను
వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునొంది నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు.
వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు.
అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
మేఘములు వర్షముతో నిండి యుండగా అవి భూమిమీద దాని పోయును; మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే యుండును.
ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను.
అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను.
తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.
రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.