Home 2 రాజులు 19:35 · తెలుగు బైబిల్

2 రాజులు

Chapter 19 · Verse 35

తెలుగు బైబిల్

2 రాజులు 19:35

ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి.

Book: 2 Kings · Chapter: 19 · Verse: 35

Cross References

నిర్గమకాండము 9:15

భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును.

నిర్గమకాండము 9:16

నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియ మించితిని.

నిర్గమకాండము 12:23

యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.

నిర్గమకాండము 12:29

అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను.

2 సమూయేలు 24:16

అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెహోవా ఆ కీడునుగూర్చి సంతాపమొంది అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనముచేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లము దగ్గర ఉండగా

2 రాజులు 19:7

అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళి పోవును; తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును.

1 దినవృత్తాంతములు 21:12

మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువ లేక నశించిపోవుట, మూడు దినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగజేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము.

1 దినవృత్తాంతములు 21:16

దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యా కాశముల మధ్యను నిలుచుచు, వరదీసిన కత్తిచేత పట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా

2 దినవృత్తాంతములు 20:24

యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు.

2 దినవృత్తాంతములు 32:21

యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవునిగుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి.

కీర్తనలు 35:5

యెహోవా దూత వారిని పారదోలును గాక వారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు గాక.

కీర్తనలు 76:5

కఠినహృదయులు దోచుకొనబడి యున్నారు వారు నిద్రనొంది యున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను.

కీర్తనలు 76:6

యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.

కీర్తనలు 76:10

నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.

యెషయా 10:16

ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపును వారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును.

యెషయా 10:33

చూడుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి యెత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme