Home యోబు 27:15 · తెలుగు బైబిల్

యోబు

Chapter 27 · Verse 15

తెలుగు బైబిల్

యోబు 27:15

వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్ట బడెదరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.

Book: Job · Chapter: 27 · Verse: 15

Cross References

1 రాజులు 14:10

కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలము చేసి, పెంటఅంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును.

1 రాజులు 16:3

కాబట్టి బయెషా సంతతివారిని అతని కుటుంబికులను నేను సమూల ధ్వంసముచేసి, నెబాతు కుమారుడైన యరొబాము సంతతివారికి నేను చేసినట్లు నీ సంతతివారికిని చేయబోవు చున్నాను.

1 రాజులు 21:21

అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెనునేను నీ మీదికి అపా యము రప్పించెదను; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతును.

కీర్తనలు 78:64

వారి యాజకులు కత్తిపాలుకాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.

యిర్మియా 22:18

కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగ లార్చరు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme