1 సమూయేలు 2:30నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చు చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.
1 సమూయేలు 25:22అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికి నేనుండనియ్యను; లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగ జేయునుగాక అని ప్రమాణము చేసియుండెను.
1 సమూయేలు 25:34నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయిన యెడల, నీకు హానిచేయకుండ నన్ను ఆటంకపరచిన ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారు లోగా నాబాలునకు మగవాడొకడును విడువబడడన్న మాట నిశ్చయము అని చెప్పి
1 రాజులు 15:25యరొబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా యేలుబడిలో రెండవ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలువారిని రెండు సంవత్సర ములు ఏలెను.
1 రాజులు 15:29తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారి నందరిని హతముచేసెను; ఎవనినైన యరొబామునకు సజీవు నిగా ఉండనియ్యక అందరిని నశింపజేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయాద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను.
1 రాజులు 16:11అతడు సింహాసనాసీనుడై యేలనారంభించిన తోడనే బయెషా సంతతివారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరినేగాని మిగుల నియ్యక అందరిని హతముచేసెను.
1 రాజులు 21:21అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెనునేను నీ మీదికి అపా యము రప్పించెదను; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతును.
2 రాజులు 9:8అహాబు సంతతివారందరును నశింతురు; అల్పులలోనేమి ఘనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండ కుండ అందరిని నిర్మూలము చేయుము.
2 రాజులు 9:9నెబాతు కుమారు డైన యరొబాము కుటుంబికులను అహీయా కుమారుడైన బయెషా కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబికులను నేను అప్పగించుదును.
2 రాజులు 9:37యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున యిది జరిగెను.
2 రాజులు 14:26ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారికి సహాయులెవరును లేకపోయిరి.
2 రాజులు 21:13నేను షోమ్రోనును కొలిచిన నూలును, అహాబు కుటుంబికులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేముమీద సాగలాగుదును; ఒకడు పళ్లెమును తుడుచునప్పుడు దాని బోర్లించి తుడుచునట్లు నేను యెరూషలేమును తుడిచి వేసెదను.
యోబు 20:7తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు. వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.
యెషయా 5:25దానినిబట్టి యెహోవా కోపము ఆయన ప్రజలమీద మండుచున్నది. ఆయన వారిమీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణకుచున్నవి. వీధులమధ్యను వారి కళేబరములు పెంటవలె పడి యున్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.