Home యోబు 12:19 · తెలుగు బైబిల్

యోబు

Chapter 12 · Verse 19

తెలుగు బైబిల్

యోబు 12:19

యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును.

Book: Job · Chapter: 12 · Verse: 19

Cross References

యెహోషువ 10:24

వారు ఆ రాజు లను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసికొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలి పించి, తనతో యుద్ధమునకు వెళ్లివచ్చిన యోధుల అధిపతు లతోమీరు దగ్గరకు రండి; ఈ రాజుల మెడలమీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి.

యెహోషువ 10:42

ఇశ్రా యేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నంద రిని వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టు కొనెను.

1 సమూయేలు 17:45

దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.

యోబు 24:22

ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడుకొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.

యోబు 34:20

వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునొంది నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు.

యోబు 34:28

బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.

యోబు 35:9

అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు.

యెషయా 37:36

అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్ష యెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబరములుగా ఉండిరి.

యెషయా 40:23

రాజులను ఆయన లేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును.

యెషయా 45:1

అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

ప్రకటన గ్రంథము 17:14

వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

ప్రకటన గ్రంథము 19:19

మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme