Home యోబు 11:6 · తెలుగు బైబిల్

యోబు

Chapter 11 · Verse 6

తెలుగు బైబిల్

యోబు 11:6

ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవుతెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.

Book: Job · Chapter: 11 · Verse: 6

Cross References

ద్వితీయోపదేశకాండము 29:29

రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.

ఎజ్రా 9:13

అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి

యోబు 9:4

ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?

యోబు 15:5

నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.

యోబు 15:8

నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?

యోబు 15:11

దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా నున్నదా?

యోబు 28:28

మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.

యోబు 33:12

ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.

కీర్తనలు 25:14

యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.

కీర్తనలు 103:10

మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.

కీర్తనలు 106:43

అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగు బాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి.

విలాపవాక్యములు 3:22

యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.

దానియేలు 2:28

అయితే మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరు నకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా

దానియేలు 2:47

మరియు రాజుఈ మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే; నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తర మిచ్చెను.

మత్తయి 13:35

అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.

రోమీయులకు 16:25

సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme