Home యిర్మియా 42:4 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 42 · Verse 4

తెలుగు బైబిల్

యిర్మియా 42:4

కాగా ప్రవక్తయైన యిర్మీయా వారికుత్తరమిచ్చినదేమనగా మీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నాను, మీ మాటలనుబట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమియు మీకు మరుగుచేయక యెహోవా మిమ్మునుగూర్చి సెల విచ్చునదంతయు మీకు తెలియజేతును.

Book: Jeremiah · Chapter: 42 · Verse: 4

Cross References

నిర్గమకాండము 8:29

అందుకు మోషే - నేను నీ యొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరో యొద్దనుండియు అతని సేవకుల యొద్దనుండియు అతని జనుల యొద్ద నుండియు తొలగి పోవునట్లు యెహోవాను వేడుకొందును గాని, యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనియ్యక ఇకను వంచన చేయకూడదని చెప్పి

1 సమూయేలు 3:17

ఏలీనీతో యెహోవా యేమి సెలవిచ్చెనో మరుగుచేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైన నీవు మరుగుచేసినయెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా

1 సమూయేలు 12:23

నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.

1 రాజులు 22:14

మీకాయాయెహోవా నాకు సెల విచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలు కుదుననెను.

2 దినవృత్తాంతములు 18:13

మీకాయాయెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చునదేదో దానినే ప్రవచింతునని చెప్పెను.

కీర్తనలు 40:10

నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర కుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసి యున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు.

యిర్మియా 23:28

కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 2:7

అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగు బాటు చేయువారు వారికి భయపడకుము.

అపొస్తలుల కార్యములు 20:20

మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు,

అపొస్తలుల కార్యములు 20:27

దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.

రోమీయులకు 10:1

సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై యున్నవి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme