Home 1 సమూయేలు 3:17 · తెలుగు బైబిల్

1 సమూయేలు

Chapter 3 · Verse 17

తెలుగు బైబిల్

1 సమూయేలు 3:17

ఏలీనీతో యెహోవా యేమి సెలవిచ్చెనో మరుగుచేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైన నీవు మరుగుచేసినయెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా

Book: 1 Samuel · Chapter: 3 · Verse: 17

Cross References

సంఖ్యాకాండము 23:17

అతడు బాలాకు నొద్దకు వెళ్లినప్పుడు అతడు తన దహనబలియొద్ద నిలిచియుండెను. మోయాబు అధికారులును అతనియొద్ద నుండిరి. బాలాకు యెహోవా యేమి చెప్పెనని అడుగగా

రూతు 1:17

నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.

1 సమూయేలు 14:44

అందుకు సౌలుయోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.

1 సమూయేలు 20:13

అయితే నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక.

1 సమూయేలు 25:22

అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికి నేనుండనియ్యను; లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగ జేయునుగాక అని ప్రమాణము చేసియుండెను.

2 సమూయేలు 3:9

యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతనిపక్షమున నేను నెరవేర్చనియెడల

2 సమూయేలు 3:35

ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతి మాలగా దావీదు ప్రమాణముచేసిసూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచిచూచినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకనెను.

2 సమూయేలు 14:18

రాజునేను నిన్ను అడుగు సంగతి నీ వెంతమాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమెనా యేలినవాడవగు నీవు సెలవిమ్మనెను.

2 సమూయేలు 19:13

మరియు అమాశా యొద్దకు దూతలను పంపినీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయ పరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగ జేయును గాకని చెప్పుడనెను.

1 రాజులు 22:16

అందుకు రాజునీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా

2 రాజులు 6:31

తరువాత రాజుషాపాతు కుమారుడైన ఎలీషాయొక్క తల యీ దినమున అతనిపైన నిలిచియున్నయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.

కీర్తనలు 141:5

నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థనచేయుచున్నాను.

యిర్మియా 38:14

తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములో నున్న మూడవ ద్వారములోనికి ప్రవక్తయైన యిర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెనునేను ఒకమాట నిన్నడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పుమనగా

దానియేలు 4:19

అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునొంది మనస్సునందు కలవరపడగా, రాజు - బెల్తెషాజరూ, యీ దర్శనమువలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతట బెల్తెషాజరు నా యేలినవాడా, యీ దర్శనఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక,

మీకా 2:7

యాకోబు సంతతివారని పేరు పెట్టబడినవారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యథా ర్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా?

మత్తయి 26:63

అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme