యిర్మియా 27:11
అయితే ఏ జనులు బబులోనురాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండ నిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు.
యిర్మియా 27:11
అయితే ఏ జనులు బబులోనురాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండ నిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు.
ఈ పట్టణములో నిలుచువారు కత్తివలన గాని క్షామమువలనగాని తెగులువలనగాని చచ్చెదరు, మేలుచేయుటకుకాదు కీడుచేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రదుకుదురు; దోపుడుసొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును.
యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.
ఏ జనము ఏ రాజ్యము బబులోనురాజైన నెబుకద్రెజరు నకు దాస్యము చేయనొల్లక బబులోనురాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనముచేయించు వరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామము చేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.
నేను ఆ మాటలనుబట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటిని బబులోనురాజుయొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని, అతనికిని అతని జనులకును దాసులైన యెడల మీరు బ్రదుకుదురు
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణము నిశ్చయముగా బబులోనురాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజల కందరికి ప్రకటింపగా
అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణముచేసి వారితోను వారి పటాలపువారితోను ఈలాగు చెప్పెను - మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి, దేశములో కాపురముండి బబులోనురాజును సేవించినయెడల మీకు మేలు కలుగును.
నేను మీకు చేసిన కీడునుగూర్చి సంతాపమొందియున్నాను, మీరు తొందరపడక యీ దేశములో కాపురమున్న యెడల, పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెల్లగింపక నాటెదను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.