Home యెషయా 32:12 · తెలుగు బైబిల్

యెషయా

Chapter 32 · Verse 12

తెలుగు బైబిల్

యెషయా 32:12

రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షా వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు.

Book: Isaiah · Chapter: 32 · Verse: 12

Cross References

ద్వితీయోపదేశకాండము 8:7

నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము.

ద్వితీయోపదేశకాండము 11:11

మీరు నది దాటి స్వాధీన పరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.

యెషయా 24:1

ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.

యెషయా 24:7

క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచు చున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను

విలాపవాక్యములు 2:11

నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది. శిశువులును చంటిబిడ్డలును పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు.

విలాపవాక్యములు 4:3

నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్ట్రపక్షులవలె క్రూరురాలాయెను.

యెహెజ్కేలు 20:6

వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని.

యెహెజ్కేలు 20:15

మరియు తమకిష్టమైన విగ్రహముల ననుసరింపవలెనని కోరి, వారు నా విధులను తృణీకరించి నా కట్టడల ననుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా

యోవేలు 1:7

అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసియున్నవి నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను

నహూము 2:7

నిర్ణయమాయెను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టు కొనుచు మూల్గుచున్నారు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme