Home ఆదికాండము 46:19 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 46 · Verse 19

తెలుగు బైబిల్

ఆదికాండము 46:19

యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను.

Book: Genesis · Chapter: 46 · Verse: 19

Cross References

ఆదికాండము 29:18

యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను.

ఆదికాండము 30:24

మరియు ఆమె - యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.

ఆదికాండము 35:16

ఎఫ్రాతాకు వెళ్లు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను.

ఆదికాండము 35:24

రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను.

ఆదికాండము 37:1

యాకోబు తన తండ్రి పరదేశ వాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.

ఆదికాండము 39:1

యాసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను.

ఆదికాండము 44:27

అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు.

ఆదికాండము 47:1

యోసేపు వెళ్లి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱెల మందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి

ఆదికాండము 49:22

యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మదాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.

ఆదికాండము 50:1

యోసేపు తన తండ్రి ముఖముమీద పడి అతని గూర్చి యేడ్చి అతని ముద్దుపెట్టుకొనెను.

నిర్గమకాండము 1:3

వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను.

నిర్గమకాండము 1:5

అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.

సంఖ్యాకాండము 1:36

బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

సంఖ్యాకాండము 26:38

బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;

ద్వితీయోపదేశకాండము 33:12

బన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజములమధ్య అతడు నివసించును

1 దినవృత్తాంతములు 2:2

దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme