ఆదికాండము 38:12
చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱెల బొచ్చుకత్తిరించు వారియొద్దకు వెళ్లెను
ఆదికాండము 38:12
చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱెల బొచ్చుకత్తిరించు వారియొద్దకు వెళ్లెను
ఇస్సాకు తల్లియైన శారా గుడారము లోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.
లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను.
ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్లెను.
ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండ యొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను.
యర్మూతు అదు ల్లాము శోకో అజేకా
సెనాను హదాషా మిగ్దోల్గాదు
కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు.
అయ్యా లోను యెతా ఏలోను
సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీ యుల కుమార్తెలలో ఒకతెను చూచెను.
నాబాలు గొఱ్ఱెలబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని
అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా, రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారువరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను.
రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను.
రాజైన దావీదు అమ్నోను మరణమాయెననుకొని అతనినిగూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.