Home 2 సమూయేలు 13:39 · తెలుగు బైబిల్

2 సమూయేలు

Chapter 13 · Verse 39

తెలుగు బైబిల్

2 సమూయేలు 13:39

రాజైన దావీదు అమ్నోను మరణమాయెననుకొని అతనినిగూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను.

Book: 2 Samuel · Chapter: 13 · Verse: 39

Cross References

ఆదికాండము 24:67

ఇస్సాకు తల్లియైన శారా గుడారము లోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.

ఆదికాండము 31:30

నీ తండ్రి యింటిమీద బహు వాంఛగల వాడవై వెళ్లగోరిన యెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా

ఆదికాండము 37:35

అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లకనేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను.

ఆదికాండము 38:12

చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱెల బొచ్చుకత్తిరించు వారియొద్దకు వెళ్లెను

ద్వితీయోపదేశకాండము 28:32

నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.

2 సమూయేలు 12:19

ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పినయెడల తనకుతాను హాని చేసికొనునేమో యనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయెనను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయెనను సంగతి గ్రహించిబిడ్డ చనిపోయెనా అని తన సేవకుల నడుగగా వారుచని పోయెననిరి.

2 సమూయేలు 14:1

రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని యున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి

కీర్తనలు 84:2

యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి.

కీర్తనలు 119:20

నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.

ఫిలిప్పీయులకు 2:26

అతడురోగి యాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme