Home ఎజ్రా 2 · తెలుగు బైబిల్

ఎజ్రా

Chapter 2

తెలుగు బైబిల్
1బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి 2యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది. 3పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు, 4షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు, 5ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు, 6పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు, 7ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు, 8జత్తూ వంశస్థులు తొమ్మిదివందల నలువది యయిదుగురు, 9జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది, 10బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు, 11బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు, 12అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు, 13అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు, 14బిగ్వయి వంశస్థులు రెండు వేల ఏబది ఆరుగురు; 15ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు, 16అటేరు వంశస్థులు హిజ్కియాతోకూడ తొంబది ఎనమండుగురు, 17బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు, 18యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు, 19హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు, 20గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు, 21బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు, 22నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు, 23అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు, 24అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు, 25కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు, 26రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు, 27మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు, 28బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు, 29నెబో వంశస్థులు ఏబది ఇద్దరు, 30మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు, 31ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు, 32హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది, 33లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు, 34యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు, 35సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది, 36యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు 37ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు, 38పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు, 39హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు, 40లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు, 41గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు, 42ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు, 43నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు, 44కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశ స్థులు, 45లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, 46హాగాబు వంశస్థులు, షల్మయి వంశ స్థులు, హానాను వంశస్థులు, 47గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, 48రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, 49ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, 50అస్నా వంశ స్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, 51బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, 52బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, 53బర్కోసు వంశస్థులు, సీసెరా వంశ స్థులు, తెమహు వంశస్థులు, 54నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, 55సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, 56యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, 57షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు, 58నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థు లును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు. 59మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను. 60వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు. 61మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయు డైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొని వారి పేళ్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడినవాని వంశస్థులు. 62వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. 63మరియు పారసీకుల అధికారిఊరీమును తుమీ్మ మును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను. 64సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను. 65వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడు వేల మూడువందల ముప్పది యేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి. 66వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు, 67వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను. 68కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. 69పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి. 70యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీ యులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme