Home నిర్గమకాండము 8:18 · తెలుగు బైబిల్

నిర్గమకాండము

Chapter 8 · Verse 18

తెలుగు బైబిల్

నిర్గమకాండము 8:18

శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. పేలు మను ష్యులమీదను జంతువులమీదను ఉండగా

Book: Exodus · Chapter: 8 · Verse: 18

Cross References

ఆదికాండము 41:8

తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేకపోయెను.

నిర్గమకాండము 7:11

అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి.

నిర్గమకాండము 9:11

ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువ లేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయు లందరికిని పుట్టెను.

నిర్గమకాండము 10:23

మూడు దినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.

యెషయా 19:12

నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తునుగూర్చి నిర్ణయించినదానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా?

యెషయా 47:12

నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో

దానియేలు 2:10

అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి - భూమిమీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్య గలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు.

దానియేలు 4:7

శకున గాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతిష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేక పోయిరి.

దానియేలు 5:8

రాజు నియమించిన జ్ఞానులందరు అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుటయైనను వారివల్ల కాకపోయెను.

లూకా 10:18

ఆయన సాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని.

2 తిమోతికి 3:8

యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme