Home దానియేలు 5:8 · తెలుగు బైబిల్

దానియేలు

Chapter 5 · Verse 8

తెలుగు బైబిల్

దానియేలు 5:8

రాజు నియమించిన జ్ఞానులందరు అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుటయైనను వారివల్ల కాకపోయెను.

Book: Daniel · Chapter: 5 · Verse: 8

Cross References

ఆదికాండము 41:8

తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేకపోయెను.

యెషయా 47:9

ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభ వించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును.

యెషయా 47:12

నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో

దానియేలు 2:27

దానియేలు రాజుసముఖములో ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను రాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకున గాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు.

దానియేలు 4:4

నెబుకద్నెజరను నేను నా యింట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనైయుండి యొక కల కంటిని; అది నాకు భయము కలుగజేసెను.

దానియేలు 4:7

శకున గాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతిష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేక పోయిరి.

దానియేలు 5:15

ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడీవిద్యగల వారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతియొక్క భావమును తెలుపలేక పోయిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme