ద్వితీయోపదేశకాండము 1:37
మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడినీ పరిచారకు డగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశిం చునుగాని నీవు దానిలో ప్రవేశింపవు.
ద్వితీయోపదేశకాండము 1:37
మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడినీ పరిచారకు డగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశిం చునుగాని నీవు దానిలో ప్రవేశింపవు.
అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను.
నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజ నులలో చేర్చబడుదువు.
మరియు ఆ కాలమున నేనుయెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు.
యెహోవా మిమ్మును బట్టి నామీద కోప పడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెనుచాలును; ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు.
నీవు ఈ యొర్దానును దాట కూడదు గాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.
యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నదిదాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీన పరచుకొనచేయును.
మరియు యెహోవా మిమ్మును బట్టి నామీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడ దనియు, నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చు చున్న యీ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను.
కావున నేను ఈ యొర్దాను దాటకుండ ఈ దేశముననే చనిపోదును; మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనెదరు.
ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను.
ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు.
మరియు యెహోవా అతనితో ఇట్లనెనునీ సంతానమున కిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.
మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.