Home సంఖ్యాకాండము 27:13 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 27 · Verse 13

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 27:13

నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజ నులలో చేర్చబడుదువు.

Book: Numbers · Chapter: 27 · Verse: 13

Cross References

ఆదికాండము 25:8

అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.

ఆదికాండము 25:17

ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పది యేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.

సంఖ్యాకాండము 20:24

అహరోను తన పితరులతో చేర్చబడును; ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు.

సంఖ్యాకాండము 31:2

తరు వాత నీవు నీ స్వజనులయొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా

సంఖ్యాకాండము 33:38

యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.

ద్వితీయోపదేశకాండము 10:6

ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకు డాయెను.

ద్వితీయోపదేశకాండము 31:14

మరియు యెహోవాచూడుము; నీ మరణదినములు సమీపించెను; నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవియ్యగా,

ద్వితీయోపదేశకాండము 31:16

యెహోవా మోషేతో యిట్లనెనుఇదిగో నీవు నీ పితరు లతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి, యెవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనులమధ్యను వ్యభిచారులై, ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి, నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు.

ద్వితీయోపదేశకాండము 32:50

నీ సహోదరుడైన అహరోను హోరు కొండమీద మృతిబొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండమీద మృతిబొంది నీ స్వజ నులయొద్దకు చేరుదువు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme