Home అపొస్తలుల కార్యములు 4:19 · తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు

Chapter 4 · Verse 19

తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు 4:19

అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;

Book: Acts · Chapter: 4 · Verse: 19

Cross References

నిర్గమకాండము 1:17

అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా

1 రాజులు 12:30

దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.

1 రాజులు 13:19

అతడు తిరిగి అతనితోకూడ మరలి పోయి అతని యింట అన్నపానములు పుచ్చుకొనెను.

1 రాజులు 14:16

మరియు తానే పాపముచేసి ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములనుబట్టి ఆయన ఇశ్రాయేలువారిని అప్పగింప బోవుచున్నాడు.

1 రాజులు 21:11

అతని పట్టణపు పెద్దలును పట్టణమందు నివసించు సామంతులును యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి.

1 రాజులు 22:14

మీకాయాయెహోవా నాకు సెల విచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలు కుదుననెను.

2 రాజులు 16:15

అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమనగాఈ పెద్ద బలిపీఠముమీద ఉదయము అర్పించు దహనబలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి, యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను.

2 రాజులు 16:16

కాగా యాజ కుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయుచేసెను.

2 దినవృత్తాంతములు 26:16

అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము చేయగా

కీర్తనలు 58:1

అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమునుబట్టి తీర్పు తీర్చు దురా?

దానియేలు 3:18

రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము.

దానియేలు 6:10

ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.

హోషేయ 5:11

ఎఫ్రాయిమీయులు మానవపద్ధతిని బట్టి ప్రవర్తింప గోరు వారు; వారికధికశ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసనొందుదురు బాధింపబడుదురు.

ఆమోసు 7:16

యెహోవా మాట ఆలకించుముఇశ్రాయేలీ యులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే.

మీకా 6:16

ఏలయనగా మీరు ఒమీ నియమించిన కట్టడల నాచ రించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుస రించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదము గాను చేయబోవుచున్నాను.

మత్తయి 22:21

అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు డని వారితో చెప్పెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme