అపొస్తలుల కార్యములు 22:7
నేను నేలమీద పడి సౌలా సౌలా, నీవెందుకు, నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని.
అపొస్తలుల కార్యములు 22:7
నేను నేలమీద పడి సౌలా సౌలా, నీవెందుకు, నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని.
దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను.
శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమాను రాలైన శారయి యొద్దనుండి పారిపోవుచున్నాననెను.
ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా, అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను.
యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.
దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.
తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగాసమూయేలూ సమూ యేలూ, అని పిలువగా సమూయేలునీ దాసుడు ఆల కించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను.
యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి?
కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు.
అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.
అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కా ర్యము చేసెనని అడుగగా వారుసిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.
నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.