Home అపొస్తలుల కార్యములు 22:4 · తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు

Chapter 22 · Verse 4

తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు 22:4

ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని.

Book: Acts · Chapter: 22 · Verse: 4

Cross References

అపొస్తలుల కార్యములు 7:58

పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములుపెట్టిరి.

అపొస్తలుల కార్యములు 8:1

ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.

అపొస్తలుల కార్యములు 9:1

సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి

అపొస్తలుల కార్యములు 9:13

అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని.

అపొస్తలుల కార్యములు 9:21

వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడ వచ్చి యున్నాడని చెప్పు కొనిరి.

అపొస్తలుల కార్యములు 16:17

ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను.

అపొస్తలుల కార్యములు 18:26

ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశద పరచిరి.

అపొస్తలుల కార్యములు 19:9

అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను.

అపొస్తలుల కార్యములు 19:23

ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను.

అపొస్తలుల కార్యములు 22:19

అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచుకొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును.

అపొస్తలుల కార్యములు 24:14

ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి,

అపొస్తలుల కార్యములు 26:9

నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని;

1 కొరింథీయులకు 15:9

ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.

ఫిలిప్పీయులకు 3:6

ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మ శాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.

1 తిమోతికి 1:13

నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme