అపొస్తలుల కార్యములు 10:17
పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి
అపొస్తలుల కార్యములు 10:17
పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి
వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా?
అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.
పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను.
పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.
అతనితో మాటలాడిన దూతవెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి
ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనోయేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింప బడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని.
వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాల మును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.