Home 2 దినవృత్తాంతములు 33:10 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 33 · Verse 10

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 33:10

యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమాన ములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి.

Book: 2 Chronicles · Chapter: 33 · Verse: 10

Cross References

2 రాజులు 21:10

కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను.

2 దినవృత్తాంతములు 36:15

వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన

నెహెమ్యా 9:29

నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన యెడల వాటివలన వాడు బ్రదుకునుగదా. వారు మరల నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచునట్లు నీవు వారిమీద సాక్ష్యము పలికినను, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకొని నీ మాట వినకపోయిరి.

సామెతలు 1:24

నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి

సామెతలు 1:25

నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.

యిర్మియా 25:4

మీ చేతిపనులవలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ జేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారముచేయుటయు మాని,

యిర్మియా 44:4

మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని

జెకర్యా 1:4

మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామీ దుర్మార్గ తను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించక పోయిరి; ఇదే యెహోవా వాక్కు.

అపొస్తలుల కార్యములు 7:51

ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme