నిర్గమకాండము 10:3కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి - హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా - నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.
లేవీయకాండము 18:5మీరు నాకట్టడలను నా విధు లను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.
ద్వితీయోపదేశకాండము 4:26మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వర లోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.
ద్వితీయోపదేశకాండము 31:21విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారియెదుట సాక్షిగానుండి సాక్ష్యము పలు కును. అది మరువబడక వారి సంతతి వారినోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే, నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను.
ద్వితీయోపదేశకాండము 31:27నీ తిరుగుబాటును నీ మూర్ఖ త్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటుచేసితిరి.
న్యాయాధిపతులు 6:10మీరు అమోరీయుల దేశమున నివసించు చున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి.
2 రాజులు 17:13అయిననుమీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్త లందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రా యేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను,
2 రాజులు 17:14వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.
2 దినవృత్తాంతములు 24:19తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారియొద్దకు ప్రవక్త లను పంపగా ఆ ప్రవక్తలు వారిమీద సాక్ష్యము పలికిరిగాని వారు చెవియొగ్గక యుండిరి.
2 దినవృత్తాంతములు 36:15వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన
నెహెమ్యా 9:10ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారియెడల బహు గర్వ ముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారియెదుట సూచకక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధినొందితివి.
నెహెమ్యా 9:16అయితే వారును మా పితరులును గర్వించి, లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయిరి.
నెహెమ్యా 9:26అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటుచేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి, నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి.
యిర్మియా 7:26వారు నా మాట వినకయున్నారు చెవియొగ్గకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు; వారు తమ పితరులకంటె మరి దుష్టులైరి.
యిర్మియా 13:15చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి.
యిర్మియా 17:23అయితే వారు వినకపోయిరి, చెవినిబెట్టక పోయిరి, వినకుండను బోధనొందకుండను మొండికి తిరిగిరి.