Home 1 దినవృత్తాంతములు 8 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 8

తెలుగు బైబిల్
1బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు, 2మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా. 3బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు 4అబీషూవ నయమాను అహోయహు 5గెరా షెపూపాను హూరాము 6ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి; 7నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను. 8వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక 9తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును 10యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి. 11హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను. 12ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను. 13బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి. 14అహ్యోషాషకు యెరేమోతు 15జెబద్యా అరాదు ఏదెరు 16మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు. 17జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు 18ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు. 19యాకీము జిఖ్రీ జిబ్ది 20ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు. 21అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమా రులు. 22ఇష్పాను ఏబెరు ఎలీయేలు 23అబ్దోను జిఖ్రీ హానాను 24హనన్యా ఏలాము అంతోతీయా 25ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు. 26షంషెరై షెహర్యా అతల్యా 27యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు. 28వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి. 29గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా; 30ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు 31గెదోరు అహ్యో జెకెరు అనువారు. 32మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి. 33నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను. 34యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను. 35మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు. 36ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను. 37మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు. 38ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు. 39అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు. 40ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme