1 దినవృత్తాంతములు 20:4
అటుతరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి.
1 దినవృత్తాంతములు 20:4
అటుతరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి.
గెజెరు రాజు, దెబీరు రాజు,
అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరి హద్దువరకు సాగి క్రింది బేత్‌హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను.
ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరల జరుగగా దావీదు తన సేవకులతోకూడ దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మ సిల్లెను.
అటుతరువాత ఫిలిష్తీయులతో గోబుదగ్గర మరల యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫా యీయుల సంతతివాడగు సఫును చంపెను.
హుషాతీయుడైన సిబ్బెకై, అహో హీయుడైన ఈలై,
దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబి యోను మొదలుకొని గాజెరువరకు తరిమి హతముచేసిరి.
ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడునుహుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.