యెషయా 13:19అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశ యాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.
యెషయా 13:21నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును
యెషయా 13:22వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిర ములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.
యెషయా 14:23నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
యెషయా 34:11గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించు కొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును.
యిర్మియా 22:14వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో రంగువేయుచు నున్నాడే;
ఆమోసు 9:1యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నా కాజ్ఞ ఇచ్చిన దేమనగా గడపలు కదలిపోవునట్లుగా పై కమ్ములనుకొట్టి వారందరి తలలమీద వాటిని పడవేసి పగులగొట్టుము; తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను, తప్పించు కొనువారిలో ఎవడును బ్రదుకకుండను నేను వారినందరిని ఖడ్గముచేత వధింతును.
జెఫన్యా 2:6సముద్రప్రాంతము గొఱ్ఱెల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.
ప్రకటన గ్రంథము 18:2అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెను మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను