జెఫన్యా 1:7
ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.
జెఫన్యా 1:7
ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.
తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.
అతడుసమాధానముగానే వచ్చితిని; మీరు శుద్ధులై నాతోకూడ బలికి రండని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను.
అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై యుండునేమో, అతడు అపవిత్రుడై యుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియు అనలేదు.
చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.
ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును
నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి
జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కు కొనినది
అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.
నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.
యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.
నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును.
నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోముమీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును
యెహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱెపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప బడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.
ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండనచేయును ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసునదియొద్ద ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా బలి జరి గింప బోవుచున్నాడు.
దేశ నివాసులారా, మీమీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయెను, ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతములమీద వినబడు చున్నది.
ఇదిగో యిదే ఆ దినము, అది వచ్చేయున్నది, ఆ దుర్దినము ఉదయించు చున్నది, ఆ దండము పూచియున్నది, ఆ గర్వము చిగిరించియున్నది, బలాత్కారము పుట్టి దుష్టులను దండించున దాయెను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.