Home జెఫన్యా 1:2 · తెలుగు బైబిల్

జెఫన్యా

Chapter 1 · Verse 2

తెలుగు బైబిల్

జెఫన్యా 1:2

ఏమియు విడవకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు.

Book: Zephaniah · Chapter: 1 · Verse: 2

Cross References

ఆదికాండము 6:7

అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను

2 రాజులు 22:16

యెహోవా సెలవిచ్చునదేమనగాయూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని రప్పింతును.

2 దినవృత్తాంతములు 24:24

సిరియనులు చిన్నదండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతివిస్తార మైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను.

2 దినవృత్తాంతములు 36:21

యిర్మీయాద్వారా పలుక బడిన యెహోవా మాట నెర వేరుటకై విశ్రాంతిదినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరములకాలము అది విశ్రాంతి దినముల ననుభవించెను.

యెషయా 6:11

ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయననివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును

యిర్మియా 6:8

యెరూషలేమా, నేను నీయొద్దనుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము.

యిర్మియా 24:8

మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువై నందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యిర్మియా 34:22

యెహోవా వాక్కు ఇదేనేను ఆజ్ఞ ఇచ్చి యీ పట్టణమునకు వారిని మరల రప్పించు చున్నాను, వారు దానిమీద యుద్ధముచేసి దాని పట్టుకొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు; మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును.

యిర్మియా 36:29

మరియు యూదా రాజైన యెహోయాకీమునుగూర్చి నీవీమాట చెప్పవలెను యెహోవా సెలవిచ్చునదేమనగా బబులోనురాజు నిశ్చయముగా వచ్చి యీ దేశమును పాడుచేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండ చేయునని ఇందులో నీవేల వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే;

విలాపవాక్యములు 2:17

యెహోవా తాను యోచించిన కార్యము ముగించి యున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు శేషములేకుండ నిన్ను పాడుచేసియున్నాడు నిన్నుబట్టి శత్రువులు సంతోషించునట్లు చేసి యున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు.

యెహెజ్కేలు 33:27

నా జీవముతోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గముచేత కూలుదురు, బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చెదను, కోటలలోనివారును గుహలలోనివారును తెగులుచేత చచ్చెదరు.

మీకా 7:13

అయితే దేశనివాసులు చేసిన క్రియలనుబట్టి దేశము పాడగును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme