Home పరమగీతము 3:4 · తెలుగు బైబిల్

పరమగీతము

Chapter 3 · Verse 4

తెలుగు బైబిల్

పరమగీతము 3:4

నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.

Book: Song of Solomon · Chapter: 3 · Verse: 4

Cross References

ఆదికాండము 32:26

ఆయన - తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు - నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.

సామెతలు 4:13

ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము

సామెతలు 8:17

నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు

పరమగీతము 1:7

నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలెను?

పరమగీతము 6:12

తెలియకయే నా జనులలో ఘనులగువారి రథములను నేను కలిసికొంటిని.

పరమగీతము 7:5

నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి. రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు.

పరమగీతము 8:2

నేను నీకు మార్గదర్శినౌదును నా తల్లియింట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమఫలరసమును నేను నీకిత్తును.

యెషయా 45:19

అంధకారదేశములోని మరుగైనచోటున నేను మాట లాడలేదు మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే.

యెషయా 49:14

అయితే సీయోనుయెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.

యెషయా 54:1

గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెషయా 55:6

యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి.

యిర్మియా 29:13

మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు,

విలాపవాక్యములు 3:25

తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.

హోషేయ 12:3

తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కల వాడై అతడు దేవునితో పోరాడెను.

మత్తయి 7:7

అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.

మత్తయి 28:9

యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme