Home పరమగీతము 2:7 · తెలుగు బైబిల్

పరమగీతము

Chapter 2 · Verse 7

తెలుగు బైబిల్

పరమగీతము 2:7

యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

Book: Song of Solomon · Chapter: 2 · Verse: 7

Cross References

సామెతలు 5:19

ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.

పరమగీతము 1:5

యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను

పరమగీతము 2:9

నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీకంతగుండ తొంగి చూచుచున్నాడు

పరమగీతము 3:5

యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

పరమగీతము 5:8

యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.

పరమగీతము 5:16

అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.

పరమగీతము 8:4

యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్ఛపుట్టువరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.

మత్తయి 26:63

అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే.

ఎఫెసీయులకు 5:22

స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme