Home రోమీయులకు 11:18 · తెలుగు బైబిల్

రోమీయులకు

Chapter 11 · Verse 18

తెలుగు బైబిల్

రోమీయులకు 11:18

నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుట లేదు.

Book: Romans · Chapter: 11 · Verse: 18

Cross References

1 రాజులు 20:11

అందుకు ఇశ్రాయేలురాజుతన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసి వేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను.

సామెతలు 16:18

నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును

జెకర్యా 8:20

సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా జనములును అనేక పట్టణముల నివాసులును ఇంకను వత్తురు.

మత్తయి 26:33

అందుకు పేతురునీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా

లూకా 18:9

తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.

యోహాను 4:22

మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.

యోహాను 10:16

ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.

రోమీయులకు 3:27

కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయ బడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టి వేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే.

రోమీయులకు 4:16

ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికికూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.

రోమీయులకు 11:20

మంచిది; వారు అవి శ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;

1 కొరింథీయులకు 10:12

తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.

గలతీయులకు 3:29

మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.

ఎఫెసీయులకు 2:19

కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme